liveandletlive.co.in estimated website worthliveandletlive.co.in domain valuewebsite worth calculator

ఈ వెబ్ సైట్ అమ్మబడును...కావలసిన వారు సంప్రదించంది
Cell: 9948616628

ప్రస్తావన

బంటీ మెమోరియల్ లక్ష్యం సమాజంలో జీవకారుణ్యం, ప్రకృతి పరిరక్షణ, పౌరుల భాద్యతను సమాజానికి తెలయచెయ్యాలని ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఈ వెబ్ సైట్ రూపకల్పన. ఇందులోని అంశాలు సామాజిక ఉద్యమంగా మారాలని మా ఆకాంక్ష. ఏ ఉద్యమ మూలాలు తెలుసుకున్నా ఒకరు లేక మరి కొందరితో మెదలైనవే అని తెలుస్తుంది. ఈ ఉద్యమంలో అందరి సహకారాన్ని కోరుతూ ఆహ్వానిస్తున్నాం. ఆలోచించండి. ప్రతి తెలుగువారి మనసు తలుపులు తెరపించి స్పూర్తిని నింపండి. ప్రస్తావన పూర్తి భాగం కోసం.... క్లిక్ చేయండి...మన సంస్కృతితో భాగమైన వీధికుక్కలను ఆదరించండి. వీధి కుక్కలు చేసిన అద్భుతాలు ....కుక్కలు కరచినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు.. శునక భాంధవుడు శ్రీ మురాల వెంకటేశ్వర్లు గారి కుక్కల ఆశ్రమం గురించి పరిచయం .

క్లిక్ చేయండి.....

చైతన్య ప్రభంజనం...

గౌతమ బుద్ద, గాంథీ, టాగూర్, జిడ్డు కృష్ణ మూర్తి....బోధనలు.... చెట్లను కాపాడండి...ప్రకృతిని రక్షించండి...చెట్ల ఆరోగ్య ప్రదాతలు..చెట్లను ఎందుకు పూజించాలి... పూర్తి వివరాల కోసం....

క్లిక్ చేయండి.....

చెట్ల కోసం.....

చెట్లకు బదులు నా తల నరకు అని చెట్లకు బదులు తలలు అడ్డుపెట్టి ప్రాణాలు కోల్పోయిన 363 మంది బిష్ణోయులు.... పూర్తి వివరాల కోసం....

క్లిక్ చేయండి.....

రక్తదానం...

రక్తదానం చేస్తే ఇంరొకరికి ప్రాణదానం చేసినట్లే...రక్తదానం గురించి పూర్తి వివరాలు...అపోహలు....నిజాలు. ఎవరు రక్తదానం చేయవచ్చు, ఎవరు చేయకూడదు.... పూర్తి వివరాల కోసం....

క్లిక్ చేయండి.....

నేత్రదానం...

నేత్రదానం చేస్తే ఇద్దరి అంధుల జీవితంలో వెలుగులు వస్తాయి...నేత్రదానం చేయండి...నేత్రదానం గురించి అపోహలు....నిజాలు పూర్తి వివరాల కోసం....

క్లిక్ చేయండి.....

పి.సత్యనారాయణ గారి ఇతర రచనలు...... క్లిక్ చేయండి.

తెలుగువారికోసం.....తెలుగులో జాలగూడు (వెబ్ సైట్) Telugukiranam
ఈ జాలగూడులో ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాలు, విహారకేంద్రాలు(టూరిజం) నదులు, సరస్సులు, తెలుగు తేజాలు మొదలగు సమస్త సమాచారం, తెలుగు వారి సంస్కృతి, తెలుగు కవులు, మన వంటకాలు, భారతీయ సంస్కృతి, మన మహర్షులు, భారతదేశానికే కీర్తి తెచ్చిన వనితామణులు, మన భక్తకవులు,సిద్ధపురుషులు, భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు..టూరిజం..
ఇంకా ఆరోగ్య విభాగంలో...అనేక వ్యాధుల గురించి ప్రముఖ డాక్టర్ల విశ్లేషణలు....
విద్యావిభాగంలో 10వ తరగతి తరువాత ఏం చదవాలి?
స్త్రీలకోసం, పిల్లల కోసం ప్రత్యేకం...
ఆహార విభాగంలో..మధుమేహం వారు తినవలసినవి... మంచి ఆహారం, పండ్లు, కూరగాయలు, నట్స్, జ్యూస్ ల తయారీ గురించి వివరించబడినది. పూలమొక్కల పెంపకం, దాంపత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు...ఆధునిక గృహోపకరణాలు గురించి వివరించబడినవి.
దయచేసి ఈ వెబ్ సైట్ ను దర్శించి మన తెలుగు భాష వెబ్ సైట్ ల అభివృద్ధికి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వగలరు
ఇట్లు కళ్యాణరావు, తెలుగుకిరణం

nestam noval బంటీరామ్ పొన్నూరి ... నేస్తం నవల పరిచయం...

ముందుమాట.... ముందుమాట.... తూర్పు రంగస్థలం పైకి విశ్వ కథానాయకుడు రాకముందే మేల్కొనే పల్లెల ప్రకృతి సౌందర్యాన్ని పల్లె ప్రజల నిష్కల్మష జీవితాలను, ముగ్గులతో తీర్చిదిద్దబడిన విశాలమైన ఇళ్లలో జరిగే సంక్రాంతి సంబరాలను, తమ పిల్లల కన్నా మిన్నగా భావించే చెట్టలను నరకవద్దంటూ ప్రాధేయపడుతూ తమ ప్రాణాలను త్యాగం చేసిన గిరిజనుల జౌన్నత్యాన్ని, భూమండలాన్ని పదికాలాల పాటు పదిలంగా కాపాడుకోవడం కోసం అడవులను సంరక్షించుకున్న మన పూర్వీకుల ముందుచూపును శ్లాఘిస్తూ నేటి తరానికి స్పూర్తిని కలిగించే రచనగా నేస్తం నవల నిలుస్తుంది. .......
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్... ..


అభినందన …. శ్రీ మండలి బుద్దప్రసాద్...

శ్రీ బంటీరామ్‌ పొన్నూరి గారు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని ఉద్భోదిస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ ‘నేస్తం’ నవల రచించడం అభినందనీయం. ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. శ్రీ బంటీరామ్‌ గారి కలం నుండి మరిన్ని మంచి రచనలు రావాని కోరుకుంటూ, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలను, శక్తియుక్తులను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను

కళాప్రపూర్ణ శ్రీ తుర్లపాటి కుటుంబరావు...

శ్రీ పొన్నూరి ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణ ప్రియుడు. ఔను! ప్రకృతికి మించి మానవుడికి నేస్తం ఎవరున్నారు? ఒక్కొక్కప్పుడు ప్రాణ మిత్రుడైనా మనకు దూరం కావచ్చు కానీ, ప్రకృతికి దూరమైతే మానవుడు బతకలేడు!
ప్రకృతిని ప్రాణాధికంగా ప్రేమించే వారున్నారు కానీ, ప్రకృతిని ఆరాధించే వారు కొద్దిమందే. నా మటుకు నేను ప్రకృతి ఆరాధకుడినని చెప్పలేను కానీ, ప్రకృతిని చూస్తే ప్రాణం లేచి వస్తుంది. ప్రకృతిలో ఆ ఆకర్షణ ఉన్నది.
అయితే మానవుడు తన విస్తృతికి, తన అవసరాలకు ప్రకృతినే ధ్వంసం చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో విపరీతాలు సంభవిస్తున్నాయి. ప్రాకృతిక విధ్వంసం వల్ల సంభవించే విపత్తును మానవుడు గుర్తించడం లేదు. కాగా, ప్రకృతికి ఆటపట్టు పల్లె పట్టు. ఒక పల్లె పట్టు జీవనాన్ని నేపధ్యంగా తీసుకుని శ్రీ పొన్నూరి ఈ ‘నేస్తం’ నవలను హృద్యంగా రచించారు.
రచయితకు తెలుగు భాషపై పట్టు ఉన్నది. అందువల్ల తన చెయ్యి తిరిగిన రచనా శైలితో పల్లెపట్టు జీవన మాధుర్యాన్ని గురించి మనోహరంగా, సహజంగా చిత్రీకరించారు. సాధారణంగా ఇప్పటి రచయితలు ఎన్నుకోని సబ్జెక్టును, నేపధ్యాన్ని తీసుకుని ఈ ‘నేస్తం’ నవలను రచించారు సత్యనారాయణ గారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

ఈ పుస్తకం యొక్క ప్రతుల కోసం.. ఫోను ద్వారా మాత్రమే సంప్రదించగలరు.. Cell: 9948616628..... పుస్తకం వెల రూ.120- పోస్ట్ ద్వారా కేవలం రూ.100- మాత్రమే..